Daily Coffee Benefits: కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు గడవదు. అలాంటి వారికి ఒక శుభవార్త. నిత్యం కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తెలిజేశారు. జపాన్ లోని కనజావా యూనివర్సిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా 16 ఎలుకలపై ఈ పరిశోధన చేశారు. వాటికి కాఫీ పౌడర్ ఇచ్చి.. వాటిపై పరిశోధనలు చేశారు.
ఆ పరిశోధన ద్వారా కాఫీలో ఉండే కహావోల్ ఎసిటేట్, కేఫ్ స్టాల్ అనే సమ్మేళనాలు ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని వారు కనుగొన్నారు. అంతేకాదు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అవి అడ్డుకుంటాయని గుర్తించారు.
అందువల్ల నిత్యం కాఫీ తాగితే.. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఇక కాఫీ తాగితే క్యాన్సర్ రాదని అదే పనిగా ఎక్కువ సార్లు కాఫీ తాగినా ప్రమాదం అని వారు హెచ్చరిస్తున్నారు. నిత్యం 2 లేదా 3 సార్లు కాఫీ తాగితే ఫర్వాలేదు గానీ అంతకన్నా ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని సైంటిస్టులు అంటున్నారు.